గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభోత్సవంలో జగన్ ఎమోషనల్

పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భాంగా ఆయన ఎమోషనల్ కు గురయ్యారు. సంగం బ్యారేజీకి స్నేహితుడు మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టామని.. ఆయన హఠాన్మరణం ఎంతో బాధించిందన్నారు. గౌతం సంస్మరణ సభలో ఇచ్చిన మాట ప్రకారం.. సంగం బ్యారేజికి మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టామని గుర్తు చేశారు. 3లక్షల 85 వేల ఎకరాలు ఆయకటు స్థిరీకరణ జరుగుతోందని.. నెల్లూరు ప్రాజెక్ట్ రూ.147 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభిస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేశారన్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్ వరాల జల్లు కురిపించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రూ.15 కోట్లతో హైవే నుంచి సంగం బ్యారేజి వరకు రోడ్.. రూ. 40 కోట్లతో ఇరిగేషన్ పనులకు కేటాయించారు. 25 గ్రామాలకు రోడ్లు వేయడానికి రూ.14 కోట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.12 కోట్లు స్పెషల్ గ్రాంట్‌గా కేటాయించడంతో పాటూ సంగం పంచాయితీకి రూ.4కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.85 కోట్లు నిధులను కేటాయించారు.