కర్నూలు జిల్లాలో జగన్‌ ఎన్నికల ప్రచార సభ

YSRCP Chief YS Jaganmohan Reddy
YSRCP Chief YS Jaganmohan Reddy

కర్నూలు: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆయన విమర్శించారు. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కాచెల్లెళ్లు, రైతులు, విద్యార్థులకు ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల కష్టాలను ప్రస్తావించిన జగన్‌.. తానున్నానంటూ భరోసానిచ్చారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయని అన్నారు.పాదయాత్రలో రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నా. ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు గడిచినా వారికి ఇంతవరకూ మద్దతు ధర ఇవ్వలేదు. ప్రతి గ్రామంలో రెండు మూడు మద్యం దుకాణాలు ఉన్నాయి. విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండటం పాదయాత్రలో గమనించా. మరోవైపు విద్యార్థులు తమ చదువులకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. వారి చదువుల కోసం తల్లిదండ్రులు ఆస్తులమ్ముకుంటున్నారు. కొంత మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా పాదయాత్రలో చూశా. నిరుద్యోగాన్ని భరించలేక యువకులు పడుతున్న ఆవేదనను చూశా. వీరందరి సమస్యలు నేను విన్నాను. మీ అందరికీ నేనున్నాను. అని జగన్‌ మాట్లాడారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/