ఢిల్లీకి పయనమైన జగన్‌

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఈరోజు ప్రధాని మోడితో సమావేశం కావడానికి ఢిల్లీ బయలుదేరారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్‌ బయలుదేరారు. అనంతరం నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లనున్నారు. ఉదయం 10.40 గంటలకు మోదీ నివాసానికి చేరుకొని భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్‌ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. 11.40 గంటలకు ప్రధాని నివాసం నుంచి బయల్దేరి 12 గంటలకు ఏపీ భవన్‌కు చేరుకుంటారు. అనంతరం ఏపీ భవన్‌ సిబ్బందితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. స్థానికంగా తనను కలవడానికి వచ్చేవారితోనూ జగన్‌ మాట్లాడనున్నారు. దిల్లీలోని ఏపీ క్యాడర్‌ అధికారులు ఆయన్ని కలవనున్నారు. మధ్యాహ్న భోజనం ఏపీ భవన్‌లోనే చేసి సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని ఏపీ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ నుంచి ఆయన తిరుపతికి వెళ్లి అక్కడే బస చేయనున్నట్లు సమాచారం.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/