అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు జగన్‌ కుట్రలు‌: లోకేశ్‌

nara lokesh
nara lokesh

విజయవాడ : సిఎం జగన్ అమరావతి రాజధానిని నాశనం చేసేందుకునాన్‌స్టాప్‌ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా అభివర్ణించిన జగన్.. అమరావతి భూములను ఎకరం రూ.10 కోట్లకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధానిగా అమరావతిపై వైస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేసిన తీరును గుర్తుచేశారు.

అమరావతి ప్రాంతం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్నదని, రాజధాని భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని జగన్, ఆయన పార్టీ నేతలు రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ చెప్పారు. ఇప్పుడు అదే వైస్సార్సీపీ నేతలు అమరావతి భూములను అధిక ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రానికి, రాజధానికి వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి పన్నిన కుట్రలు, కుతంత్రాలకు అంతు లేకుండా పోయిందని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటూ ప్రజలను జాగృతం చేస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/