ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలన్లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును.. ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వైస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ లో జగన్ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

ఎన్టీఆర్ పైన తనకు ఎనలేని గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పేరు ఎత్తితే నచ్చని వ్యక్తి చంద్రబాబు అని చెబుతూ… చంద్రబాబు పేరు ఎత్తినే ఇష్టపడని వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. నాడు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడవ కుండా ఉంటే ఆయన రెండో సారి పూర్తి కాలం సీఎంగా కొనసాగేవారన్నారు. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ కూతుర్ని గిఫ్ట్‌గా ఇస్తే.. చంద్రబాబు వెన్నుపోటు రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకుంటారని.. ఎంతోమందిని ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని చేశానని చెప్పుకుంటారన్నారు. అలాంటి చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.

యూనివర్శిటీ పేరు మార్చడానికి ముందు తనను తాను ప్రశ్నించుకున్నాను అన్నారు జగన్. బాగా ఆలోచించిన తర్వాతే హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పథకాల సృష్టికర్త ఎవరు అంటే అందరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. 1983 టీడీపీ పుట్టుక ముందే 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు.. మరో మూడు కాలేజీలను వైఎస్సార్ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని టీడీపీ.. వాళ్ల కు కావాల్సిన పేర్లను బలవంతంగా పెట్టుకుందన్నారు.

నాడు ఎన్టీఆర్ సమయంలో వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నా .. తమ పార్టీ ఏనాడు ఎన్టీఆర్ పైన ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదన్నారు. తన పాదయాత్ర సమయంలో క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టమని ఎవరూ అడగకుండానే హామీ ఇచ్చానని, అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసామని ముఖ్యమంత్రి చెుప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని జగన్ తెలిపారు..