ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్, చంద్రబాబు

ప్రధానికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించిన జగన్

jagan-chandrababu-greets-modi-on-his-birthday

హైదరాబాద్ః నేడు ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు, దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షును భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. మోడీని కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/