ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్

సీఎం జగన్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దర్శిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు రోహిత, రాజీవ్ మద్దిశెట్టిలను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. వివాహానికి హాజరైన ముఖ్యమంత్రికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటె రేపు సీఎం జగన్ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్ధులకు జగన్ ట్యాప్ లను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.00 – 1.00 వరకు 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.