మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి పెళ్లి రిసెప్షన్‌ కు హాజరైన సీఎం జగన్

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడు ఆదిత్య‌వ‌ర్మ‌ (గోకరాజు రామరాజు కుమారుడు) పెళ్లి రిసెప్షన్‌లో సందడి చేసారు సీఎం జగన్. మంగళగిరి సీకే కన్వెన్షన్స్ లో ఈ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు విచ్చేసిన సీఎం జగన్ నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.