వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్ నివాళ్లు

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళ్లు అర్పించారు. బుధువారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయలోని హెలిప్యాడ్‌కు చేరుకొని.. అనంతరం రోడ్డు మార్గంలో వైయస్‌ఆర్‌ ఎస్టేట్‌కు చేరుకోవడం జరిగింది. రాత్రి అక్కడే బస చేసారు. కొద్దీ సేపటికి క్రితం వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకొని తన తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. జగన్ తో పాటు తల్లి విజయమ్మ , సోదరి షర్మిల కూడా పాల్గొన్నారు.

అంతకు ముందు తన ట్విట్టర్ లో జగన్ ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని’ ట్వీట్ చేసారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారు. ‘నేను వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని జగన్ ట్వీట్స్ చేసారు.

నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది#YSRForever— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2021