జగన్‌ ఎప్పటికీ ప్రతిపక్ష నేతగానే ఉంటాడు..

anita, tdp mla
anita, tdp mla


తిరుమల: పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..జగన్‌ ఎప్పటికీ ప్రతిపక్ష నేతగానే ఉండిపోతాడని, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా జగన్‌ సియం అవుతాడని పగటి కలలు కంటుందని ఆమె అన్నారు. సియం చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే టిడిపిని గెలిపిస్తాయని, ఏపిలో టిడిపిదే అధికారం అని అనిత అన్నారు. జనసేన ఒంటరిగానే ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని భావిస్తున్నానని ఆమె అన్నారు.