మెడికల్ కాలేజీని ప్రారంభించిన జగదీష్ రెడ్డి

Jagdish Reddy
Jagdish Reddy

హైదరాబాద్‌: మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు. మెడికల్ కాలేజీని సాధించిన కొత్త జిల్లా సూర్యాపేట ఒక్కటే కావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిన సిఎం కెసిఆర్ కు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారన్నారు. తక్కువ సమయంలో మెడికల్ కాలేజీలో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు చిల్లర రాజకీయాలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని, భవిష్యత్తులో కాలేజీకి కావలిసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/