కమ్యూనిస్టు పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి జగదీశ్

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కమ్యూనిస్టు పార్టీల నేతలు తీవ్ర కృషి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి కృషి వల్లే టిఆర్ఎస్ విజయం సాధించని , వారికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి జగదీశ్ రెడ్డి. మంగళవారం హైదరాబాద్ లోని సీపీఐ, సీపీఎం పార్టీల కార్యాలయాలకు వచ్చిన జగదీశ్ రెడ్డి… ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు కమ్యూనిస్టు పార్టీల నేతలకు వారు ధన్యవాదాలు తెలిపారు జగదీశ్ రెడ్డి.

టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యానికి సీపీఐ, సీపీఎం నేత‌లు కృషి చేశారు. దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. సాఫీగా పాల‌న సాగుతుంటే ఉప ఎన్నిక‌తో అల‌జ‌డి సృష్టించారు. క‌మ్యూనిస్టు నేత‌ల స‌హ‌కారంతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలిచారు. భ‌విష్య‌త్‌లోనూ ఐక్యంగా క‌లిసి ముందుకు వెళ్తాం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. అలాగే మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి.. సీపీఎం, సీపీఐ స‌హ‌కారంతో నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తాను. నా విజ‌యానికి స‌హ‌క‌రించిన సీపీఎం, సీపీఐ నేత‌ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.