సీఎం రేవంత్ ఫై మాజీ మంత్రి జగదీశ్ సెటైర్లు

సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేస్తే.. తమకు సుప్రీం కోర్టు గేట్లు ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియా తో మాట్లాడుతూ.. దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్‌ది గురివింద గింజ వైఖరి అని మండిపడ్డారు.

చంద్రబాబు లాంటి తెలంగాణ వ్యతిరేక నాయకుల సంకలో రేవంత్ ఉన్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పార్టీ మారాలని రాత్రిళ్ళు ఇంటింటికీ తిరిగి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడేటప్పుడు సోయి ఉండి మాట్లాడాలని హితవు పలికారు. దేశంలో జరుగుతున్న అనర్ధాలకు ఆ పార్టీయే కారణం అన్నారు. నాడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరింది ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే అని తేల్చిచెప్పారు.