ప్రధాని జెసిండాకి లంచం ఇచ్చిన బాలిక!

Jacinda Ardern
Jacinda Ardern

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండాకి ఓ 11ఏళ్ల బాలిక లంచం ఇచ్చారు. ఆ లంచం ఎంతంటే? 5 న్యూజిలాండ డాలర్లు. అయితే అసులు లంచం ఎందుకిచ్చిదంటే న్యూజిలాండ్‌లో విక్టోరియా అనే 11 ఏళ్ల బాలికకు డ్రాగన్లపై మనసు పడింది. వాటికి ఎలాగైన శిక్షకురాలిగా మారాలని భావించింది. కానీ, అవి ఎక్కడుంటాయో తెలియదు. అందుకే వాటి గురించి తెలుసుకొనేందుకు పరిశోధనలు చేయాలని భావించింది. దీంతో ప్రభుత్వాన్ని డ్రాగన్లపై పరిశోధనలు చేయాల్సిందిగా ఈ చిన్నారి కోరింది. ఈ మేరకు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌కు ఓ లేఖ కూడా రాసింది. ప్రధానికి లంచంగా ఓ ఐదుడాలర్లను కూడా పెట్టి పంపించింది. ఈ చిట్టి అభిమాని నుంచి వచ్చిన లేఖను న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఓపిగ్గా చదవి నవ్వుకొన్నారు. తర్వాత ఆ చిన్నారికి సమాధానం కూడా రాశారు. ఇప్పటికైతే డ్రాగన్లు, ఫిజిక్స్‌పై ఎటువంటి పరిశోధనలు చేయడంలేదుగగ అని పేర్కొన్నారు. దీనిపై స్వదస్తూరితో సరదాగా కొన్ని వాక్యాలు కూడా రాశారు.ఖఖపి.ఎస్‌. నేను డ్రాగాన్లు ఎక్కడైనా బయటకు వస్తాయేమో ఓ కన్నేసి పెడతాను. ఇంతకీ డ్రాగన్లు సూట్‌ వేసుకొంటాయా..? అని ప్రధాని ప్రశ్నించారు. ఆ చిన్నారికి ప్రధాని లేఖ రాసిన విషయాన్ని న్యూజిలాండ్‌ పీఎంవో కూడా ధ్రువీకరించింది. ఏప్రిల్‌ 30 జెసిండా ఈ లేఖను రాసినట్లు పేర్కొంది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/