ప్రాణం నా ప్రాణం.. నీతో ఇలా..

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘జాను.. ఈసినిమాలో తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.. ప్రాణం.. నా ప్రాణం.. నీతో ఇలా.. గానం తొలి గానం పాడే వేళ.. అంటూ హార్ట్‌టచింగ్ మెలొడీ ప్రేమలోని గాఢతను ఈపాట తెలియజేసేలా ఉంది.. గోవింద్ వసంత సంగీతం అందించారు. చిన్మయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈచిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈచిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే మిగిలిన పాటలను విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/