షమీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా: సామ్ కరన్

మొహాలి: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యువ ఆల్రౌండర్ సామ్ కరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. షమీ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అనడంలో అతిశయోక్తి లేదంటున్నారు. ఐపిఎల్లో ఈ ఇద్దరూ ఒకే జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బౌలింగ్ మెరుగుపరుచుకోవడంలో షమీ తనకు ఎంతో సహకరిస్తున్నాడని చెప్పాడు. అతని నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా. షమీ నుంచి సలహాలు, విలువైన సూచనలు తీసుకుంటున్నాను. హాట్రిక్ వికెట్ల సంగతి నాకు ఆసమయంలో తెలియదు. నేను పరుగుల నియంత్రణపై ఏకాగ్రత పెట్టడంతో ఆ విషయాన్ని గమనించనేలేదు. కానీ అది గొప్ప అనుభూతి. ఐపిఎల్ ఒక గొప్ప టోర్నీ. నేను ప్రతి మ్యాచ్లోనూ వందశాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. తనకంటూ ప్రత్యేక ఆశయాలు ఏం లేవంటున్న ఈ యువ ఆల్రౌండర్…కుటుంబ కోసం ఏదైనా చేస్తా….అంటున్నాడు. ప్రపంచకప్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆడేందుకు అవకాశం దక్కుతుందనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.
మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/sports/