‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ విడుదల డేట్ ఫిక్స్

Itlu Maredumilli Prajaneekam gets its release date

గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది చిత్రం సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది.విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న నరేష్..’ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ – జీ స్టూడియోస్ వారు నిర్మిస్తుండగా, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. ‘జాంబీ రెడ్డి’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.