మరో ‘రింగ..రింగ’ రేంజ్‌లో ఐటెం!

బన్నీ మూవీ ‘పుష్ప’ కోసం దేవిశ్రీ సిద్ధం

Allu Arjun
Allu Arjun

సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా ‘పుష్ప’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే..

ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణకు కరోనా లాక్‌డౌన్‌ అడ్డొచ్చిన విషయం తెలిసిందే.. దీంతో ఆరు నెలలుగా షూటింగ్‌ ఆగిపోయింది.

ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరిపారు..దేవిశ్రీ ఇప్పటికే ఈచిత్రం కోసం దాదాపు అన్ని ట్యూన్స్‌ను రెండు మూడు వెర్షన్లుగా రెడీ చేశారట..

త్వరలోనే ఫైనల్‌ చేస్తారని తెలిసింది.. ఇక ఐటెం సాంగ్‌ విషయంలో దేవిశ్రీ చాలా పట్టుదలతో ఉన్నారట..

అందుకే బన్నీతో గతంలో చేసిన ‘అ..అంటే అమలాపురం… రింగ..రింగ రేంజ్‌లో ఐటెం సాంగ్‌నురెడీ చేశారని సమాచారం..

‘పుష్ప’ కోసం అలాంటి ఐలెం సాంగ్‌ను ఇవ్వాలని దేవిశ్రీ కృతనిశ్చయంతో ఉన్నారట.. అందుకే చాలా సమయం కేటాయించి ఐటెం సాంగ్‌ ట్యూన్‌ను సిద్ధంచేశారని తెలిసింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/