టాప్‌ ఐదు సంస్థల్లో టర్నోవర్‌ రూ.31వేలకోట్లకుపెరుగుదల

ITC1-
ITC

టాప్‌ ఐదు సంస్థల్లో టర్నోవర్‌
రూ.31వేల కోట్లకు పెరుగుదల

న్యూఢిల్లీ: సెన్సెక్స్‌లోని టాప్‌ పది బ్లూచిప్‌ కంపెనీల్లో ఐదు కంపెనీల మార్కెట్‌ విలువలు పెరిగాయి. గత వారంలో 31,381.39 కోట్లు పెరిగినట్లు బిఎస్‌ఇ గణాంకాలు చెపుతు న్నాయి. ఐటిసి అన్నింటికంటే ఎక్కువగా లాభ పడింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఐటిసి, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్ర బ్యాంకు, ఒఎన్‌జిసిలు మార్కెట్‌ విలువలు పెంచుకోగలిగితే టిసిఎస్‌, రిలయన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐలు నష్టాల్లో మునిగాయి. ఐటిసి మార్కెట్‌ విలువలు 16,856.05 కోట్లు పెరిగి రూ.3,53,141.55 కోట్లకు పెరిగాయి. కోటక్‌ బ్యాంకు మార్కెట్‌ విలువలు 5749.62 కోట్లు పెరిగి 2,28,754.68 కోట్లకు పెరిగాయి. ఒఎన్‌జిసి విలువలు సైతం రూ.4941.25 కోట్లు పెరిగి 206679.25 కోట్లకు చేరింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ విలువలు 2283.7 కోట్లు పెరిగి రూ.3,41,841.36 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ విలువలు 1550.77 కోట్లు పెరిగి రూ.2,98,185.82 కోట్లకు చేరింది. ఇతరత్రా చూస్తే రిలయన్స్‌ విలువలు 15,687.72 కోట్లు క్షీణించి రూ.6,98,278.03 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి విలువలు 8928.55 కోట్లు క్షీణించి 2,85,319.16 కోట్లకు చేరితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు విలువలు రూ.3586.68 కోట్లు క్షీణించి 5,34,142.49 కోట్లకు చేరింది. ఎస్‌బిఐ విలు వలు సైతం 2231.14 కోట్లు క్షీణించి రూ.2,32,797.87 కోట్లకు చేరితే టిసిఎస్‌ విలు వలు 506.57 కోట్లు క్షీణించి రూ. 5,19,350.91 కోట్లకు చేరింది. ర్యాంకింగ్‌ల పరంగా చూస్తే టిసిఎస్‌ అగ్రస్థానంలో నిలిస్తే వరుసగా రిలయన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐ టిసి, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌ డిఎప్‌సి, ఎస్బీఐ, కోటక్‌ బ్యాంకు, ఒఎన్‌జిసి సంస్థ లు నిలిచాయి. గతవారంలో బిఎస్‌ఇ కీలక సూచీ సెన్సెక్స్‌ 418 పాయింట్లు క్షీణించి 34,315.63 పాయింట్లకు చేరిన సంగతి తెలిసిందే.