ఐటిసి 9.5శాతం ర్యాలీ

ITC
ITC

ముంబై: ఎఫ్‌ఎంసిజి దిగ్గజ సంస్థ అయితే ఐటిసి సోమవారం ప్రారంభంలోనే 9శాతానికి పైగా పుంజుకుంది. బిఎస్‌ఇలో ఈ సంస్థ షేరు రూ.249.10వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత వారంలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో పొగాకు ఉత్పత్తులపై శ్లాబ్‌ను పెంచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కౌన్సిల్‌ పొగాకు ఎలాంటి రేటును పెంచకపోవడంతో పాటు హోటల్‌ గదులపై జిఎస్‌టి తగ్గించింది. ఇక కేంద్రం ప్రకటించిన కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా ఐటిసి కంపెనీకీ భారీగా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్‌ ప్రారంభంలోనే ఐటిసి షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఒక దశలో 9.50శాతం ర్యాలీ చేసి రూ.260.30వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇక ఈ ఏడాదిలో ఈ సంస్థ షేర్లు రూ.234.10వద్ద ఏడాది కనిష్టానికి, రూ.310.00వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో సూచీలు రెండోరోజూ లాభాల బాటాపట్టాయి.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/