మధ్యాహ్నం 3 గంటలకు విశ్వాస పరీక్ష

స్పష్టం చేసిన స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌

CM Kumaraswamy
CM Kumaraswamy

బెంగళూరు: కర్ణాటకలో గత కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఈరోజుతో తెరపడే అవకాశం కనిపిస్తోంది. బిజెపి నేతలు స్పీకర్‌తో సమావేశమయ్యారు. సమయంతో సంబంధం లేకుండా బల పరీక్ష నిర్వహించాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి బల పరీక్షకు సంబంధించి చర్చలు జరగాలని కోరారు. ఇందుకు స్పీకర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే సమావేశాలు ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా విధాన సభ ప్రాంగణంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కారణంగా సభ ఆలస్యంగా ప్రారంభం అయింది. మధ్యాహ్నం 12గంటల తర్వాతే సభ మొదలైంది. చర్చలు ఆలస్యమైతే రాత్రి 7గంటల సమయంలోనైనా బల పరీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/