ఐటి రంగంలో వేగవంతమైన మార్పులు

IT Sector
IT Sector

ఐటి రంగంలో వేగవంతమైన మార్పులు

ముంబై: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో త్వరితగతిన మార్పులు వస్తున్నాయి. ఈ రంగం నాలుగవ పారిశ్రామిక విప్లవంగా ఇదివరకే పేరు గడించింది. అందుకే ముఖ్యంగా విద్యార్థులు ఈ రంగంలో ఉపాధి అన్వేషించే వారు ఈ మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ మున్ముందు రాబోయే సవాళ్లను అధ్యయం చేస్తూ ప్రగతి సాధించవలసిన అవస రం ఎంతైనా ఉంది. గతంలో కంటే ఏమైనా మార్పులు వస్తే, ఊహించనంత వేగంగా వస్తా యి కాబట్టి, దానికి ముందుగానే సిద్ధపడిన వారికి పరిశ్రమ పెద్దపీట వేస్తోంది. కేవలం రొటీన్‌గా పనిచేసిన వారికి ఐటి రంగంలో చోటు లభించకపోవచ్చు. చురుకుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మార్పులను జీర్ణం చేసుకొని తమకితాము సిద్ధపడిన వారికి అగ్రతాంబూలం లభిస్తోంది. గత రెండేళ్లుగా మందకొడిలో ఉన్న ఐటి పరిశ్రమ ఇప్పుడు వేగం పుంజుకొని ముందుకు దూసు కెళ్లేం దుకు సిద్ధమవు తోంది. ఈ పరిశ్రమ రాబోయే రోజుల్లోనే ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల ఆటోమేషన్‌. యంత్రీకరణ ఏ రంగాన్నైనా ఇట్టే మార్చివేస్తోంది.

10 మంది చేసే పని ఒకరు చేసేలాగా మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఐటి పరిశ్రమ కూడా అదేదశలో ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ దశలో అవసరమైనది నైపుణ్యతను పెంచుకోవ డం, ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపడే లాగా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ యంత్రీకరణ కేవలం ఐటి రరగం లోనే కాదు, మిగతా అన్ని రంగాల్లో కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇదివరకు ఏదైనా ఒక సిమెంట్‌ కర్మాగారంలో పనులు స్కిల్డ్‌ వర్కర్లు చేసే పనిని, ఇప్పుడు కేవలం ఒక బటన్‌ నొక్కి త్రుటిలో ఆ పనిని పూర్తిచేసేస్తున్నారు. ఈ రకమైన వేగం కేవలం ఆ పరిశ్రమకే కాకుండా కీలకపరిశ్రమలైన ఉక్కు, సిమెంట్‌, మందులు, విద్యుత్‌ ఉత్పత్తి తదితర రంగాలకు విస్తరించింది. ఆ వేగం ఇప్పుడు ఐటి పరిశ్రమకు చేరింది. నైపుణ్యతా సాధనలో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయి. నిన్నటి పద్ధతి నేడు ఉండడం లేదు, నేడు ఉన్న పద్ధతి రేపటికి ఉంటుందో లేదో తెలియదు. ఐటి పరి శ్రమ అంటే గతంలో కోడింగ్‌ ఒకటే ప్రధానమైన విషయం అనుకునే వారు.

అయితే ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. కోడింగ్‌తో పాటు ఇతర అంశాలు కూడా ప్రధానమైన విషయాలుగా మారాయి. మొబైల్‌ యాప్‌లను అభివృద్ధి చేయడం, హెచ్‌టిఎంఎఫ్‌ఐ, నాకౌట్‌జెఎస్‌, యాంగ్యులర్‌జెఎస్‌ మొదలైన అంశాలు కూడా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి తోడుగా అనలిటికల్‌ సామర్థ్యం, క్రిటికల్‌ థ్రింకింగ్‌ గణనలో నేర్పరి తనం, వేగం మిగతా వారి కంటే తొందరగా పనిపూర్తి చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కమ్యూని కేషన్‌, బిజినెస్‌ డొమైన్‌ వంటి విషయాలకు ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు సిప్లస్‌ ప్లస్‌, సి యాష్‌, జావా, పిహెచ్‌డి, ఎస్‌క్యూఎల్‌, ఆరెకల్‌, ఆర్‌డిబిఎంఎస్‌ వంటి విషయాలకు ఎంతో ప్రాధా న్యత ఉండేది. అవి నేర్చుకుంటే చాలు ఐటి పరిశ్రమలో ఉపాధి తప్పనిసరిగా లభిస్తుంది అన్న భావన ఉండేది. కానీ, అవన్నీ ఇప్పుడు అత్యంత ప్రాథమిక అంశాలు అయిపోయాయి.

అవకాకుండా మిగతా మరికొన్ని అంశాలలో నేర్పరి తనం తప్పనిసరి అయింది. ఐటి పరి శ్రమలో ఒకప్పుడు ఇంజినీర్లను సాఫ్ట్‌వేర్‌ ఇంజి నీర్లు అనేవారు. అయితే ఇప్పుడు అలా పిలువ డమే కాకుండా వేరే తరహా ఇంజినీర్లు కూడా ప్రవేశిస్తున్నారు. డాటా సైంటిస్ట్‌ అనేది ఒక కొత్త హోదా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్లౌడ్‌, సెక్యూరిటీస్‌, ఎనలటిక్స్‌ వంటి అంశాలను చొప్పిస్తూ కోడింగ్‌ చేయడం డాటా సైంటిస్ట్‌ ప్రధాన కర్తవ్యం. వారిని కూడా ఇంజినీర్లు గానే పరిగణించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల కంటే ఈ డాటా సైంటిస్ట్‌ నేడు పరిశ్రమలో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇక మున్ముందు ఈ పరిశ్రమలో డాటా సైంటిస్ట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌, సోషన్‌ మీడియా ఎక్స్‌పర్ట్‌, విఆర్‌(వర్చూవల్‌ రియాల్టీ) ఎఆర్‌(అగ్మెంటెండ్‌ రియాల్టీ) వంటి కొత్త ఉద్యోగాలు, కొత్త హోదాలు లభ్యం కానున్నాయి. యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇంజినీర్స్‌ (యుఎక్స్‌యుఐ)లకు పెద్ద పీట వేయనున్నారు. ఆటోమేషన్‌ ఈ పరిశ్రమలో పెరిగినా, ఉద్యోగాలు తగ్గుతాయన్న భయం ఎవరికీ ఉండనక్కర్లేదు. ఉద్యోగాల తీరు మారుతుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ వంటి రంగాలు కొత్తగా ప్రారంభమవుతాయి. వీటివల్ల మనుషులు చేసే పని క్రమంగా యంత్రాలు చేస్తాయి. కంపెనీల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. రిసెర్చ్‌ కార్యక్రమాలు వేగవంతమవుతాయి. ఈ కొత్త రంగాల వల్ల 2020నాటికి అదనంగా 23లక్షల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా లభిస్తాయని ఒక అంచనా. ఇక స్టాక్‌ మార్కెట్లలో ఈ రంగానికి చెందిన సహాయం మరింత అధికమవుతోంది. అప్పటికప్పుడు ఎన్‌ఎవిలు అంచనా వేయడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి సమాచారం ఇవ్వడం, ఇన్‌కం ట్యాక్స్‌ మరింతగా లెక్కగట్టడం, ఆయా అంకెలను, గణాంకాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ప్రచురించడం వంటి కార్యకలాపాలు అభివృద్ధి చెంది ఉద్యోగాలు పెరుగుతాయి.