హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ దాడులు

CBI raids
CBI raids

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ( ఆదాయపు పన్నుశాఖ) దాడులు చేస్తుంది. నగరంలోని పలు సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తుంది. షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన ఆఫీసులతోపాటు వారి ఇళ్లలో కూడా సోదాలు చేశారు. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ సహా 10 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఏస్టేట్, వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రియల్ ఏస్టేట్ సంస్థలు నిర్వహిస్తున్న యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్‌ఎస్ బ్రదర్స్ భారీగా పెట్టుబడి పెట్టింది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారం చేస్తోంది. వాసవితో పాటు పలు ప్రాజెక్టులను హానర్స్ సంస్థ చేపట్టింది. కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా హానర్స్ జోక్యం చేసుకుంది. ఈ క్రమంలో హానర్స్, సుమధుర, వాసవిల పరంపర ఆర్ఎస్ బ్రదర్స్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాసవి, సుమధురతో కలిసి ఆర్‌ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు చేస్తోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/