సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు

రియల్ హీరో సోనూసూద్ ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేపట్టారు. ముంబై లోని తన నివాసం తో పాటు ఆఫీస్ లలో ఏక కాలంలో అధికారులు దాడులు చేపట్టారు. సోనూ సూద్ ను ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం మెంటార్ షిప్ ప్రోగ్రాం కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లో బుధవారం సోనూ సూద్ కు సంబందించిన ఇల్లు మరియు ఆఫీస్ లపై ఐటి అధికారులు దాడులు చేశారు. పలు లెక్కల అవకతవకలపై ఆరా తీసిన‌ట్టు , సోనూ సూద్‌కు చెందిన అకౌంట్ బుక్‌లో కొన్ని ట్యాంపరింగ్‌లకు సంబంధించి ఈ సోదాలు చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడి చేయడంతో సోనూసూద్ షాక్ అయ్యారు.

ఇక కరోనా సమయంలో సోను సూద్ ఎలాంటి సాయం చేసారో చెప్పాల్సిన పనిలేదు. వలసదారుల కోసం ప్రత్యేక విమానాలను నిర్వహించి వారిని ఇళ్లకు పంపించాడు. వారికి అండ‌గా నిలిచారు. త‌న సేవల‌తో , త‌న కార్యక్ర‌మాల‌తో వేలాది మందికి ఆదర్శంగా నిలిచారు.ల‌క్షలాది మంది గుండెల్లో దైవంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పటు చేసి ఎంతమందికి ప్రాణం పోశారు. ఇప్పటికి కూడా సాయం అడిగినవారికి సాయం చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఐటీ దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.