ఏషియన్ సినిమా కార్యాలయాల్లో ఐటీ సోదాలు

వారి సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు

Asian-Cinemas
Asian-Cinemas

హైదరాబాద్‌: సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమా కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ లోని ఈ సంస్థ కార్యాలయాలతో పాటు, అధినేతలు నారాయణదాస్, సునీల్ నారంగ్ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు జరిపినట్టు సమాచారం. హీరో మహేశ్ బాబుతో కలిసి ఏఎంబీ మాల్ ను నిర్మించింది ఈ సంస్థే. కాగా, హీరో అల్లు అర్జున్ తో కలిసి మరో మల్టీప్లెక్స్ ను ఈ సంస్థ త్వరలో నిర్మించనుంది. నైజాంలోని పలు ప్రాంతాల్లో ఏషియన్ సినిమా మాల్స్ ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/