దిల్‌ రాజు కార్యాలయంలో ఐటీ తనిఖీలు

Dil Raju
Dil Raju

హైదరాబాద్‌: రేపు మహర్షి చిత్రం విడుదల కానున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు హైదరాబాద్‌, శ్రీనగర్‌ కాలనీలోని కార్యాలయంలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ఐటీ బృందం ప‌లు రికార్డుల‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. గ‌తంలోను భారీ చిత్రాల రిలీజ్ స‌మ‌యంలో నిర్మాత‌ల ఆఫీసులు, ఇళ్ల‌పై ఐటీ సోదాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌హ‌ర్షి చిత్రం మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌గా ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/