ప్రముఖ నిర్మాత ఇంటిపై ఐటీ దాడులు

రాజకీయ నేతలనే కాదు సినీ ప్రముఖులను సైతం ఐటీ అధికారులు వదలడం లేదు. తాజాగా ప్రముఖ ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్ అన్బు చెళియన్​కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 2020 ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో అన్బు ఇళ్లపై ఐటీ దాడులు జరగ్గా.. పెద్ద మొత్తంలో డబ్బు దొరికింది. ఇప్పుడు మరోసారి దాడులు జరిపారు. చెన్నై, మధురై సహా ఆ రాష్ట్రంలోని మొత్తం 10 చోట్ల అన్బు​కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేశారు.

తమిళ సినీ పరిశ్రమలో అన్బు చెళియన్​.. బడా ఫైనాన్షియర్. విజయ్​ నటించిన బిగిల్​ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏజీఎస్​ ఎంటర్​టైన్​మెంట్​కు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చారు. గోపురం ఫిలింస్ అనే బ్యానర్​పై పలు సినిమాలు నిర్మించారు. కాగా 2020 ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో అన్బు చెళియన్​ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నై, మధురైలోని నివాసాల నుంచి రూ.50కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్బు చెళియన్​ స్నేహితుడు శరవణన్​ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. మధురైలోని నివాసం నుంచి రూ.15కోట్లు జప్తు చేశారు. అదే సమయంలో హీరో విజయ్ ఇళ్లలోనూ సోదాలు జరిపి, ఆయన్ను ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మరోసారి అదే తరహాలో దాడులు జరగడం తో తమిళనాట చర్చ గా మారింది.