చెన్నైలో మరోసారి ఐటీ దాడులు

IT Raids in Chennai

IT Raids in Chennai and other parts of tamil nadu
INCOME TAX DEPARTMENT

చెన్నై: తమిళనాడులో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపున్నుశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెన్నై, వేలూరుల్లో 31 చోట్ల గురువారం జరిపారు. రాష్ట్ర మంత్రి కెసి వీరమణి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. మంత్రి సహాయకుడి నివాసగృహం సహా చెన్నై, వేలూరు జిల్లాల్లో 31 చోట్ల ఐటీ తనిఖీలు జరిగాయి. ఇందులో 300 మందికిపైగా ఐటీ అధికారులు పాల్గొనగా, గురువారం ఉదయం 6 గంటల నుండి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి.