మంత్రి మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలు..ఈడీకి లేఖ రాయనున్న ఐటీ

ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి ఇవ్వనున్న ఐటీ

it-officials-to-write-letter-to-ed-in-malla-reddy-issue

హైదరాబాద్ః మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, పెద్ద ఎత్తున బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు తెలిపారు.

మరోవైపు ల్యాప్ టాప్ వ్యవహారం, ఐటీ అధికారుల దాడి ఘటనను ఐటీ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాలపై పూర్తి వివరాలతో ఈడీకి లేఖ రాయనుంది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి వెల్లడించనుంది. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై అన్ని వివరాలు తెలియాలంటే ఈడీ విచారణ కూడా జరగాలని ఐటీ భావిస్తోంది. ఇదే జరిగితే మల్లారెడ్డికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్టేనని అంటున్నారు. ఆయనపై ఈడీ దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/