విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడం దురదృష్టకరం

రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది

vishnukumar raju
vishnukumar raju

అమరావతి: విశాఖలో చంద్రబాబును ప్రజలెవరూ అడ్డుకోలేదని..రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. పోలీసుల అనుమతితోనే చంద్రబాబు విశాఖ వచ్చారని తెలిపారు. గుడ్లు, చెప్పులు విసరడం సరికాదని విమర్శించారు. ఇలాంటి చర్యలతో వైఎస్‌ఆర్‌సిపికి చెడ్డపేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్యాక్షనిజాన్ని తీసుకొచ్చే పద్ధతిని ఎవరూ ప్రోత్సహించవద్దని ఆయన పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/