ఉత్కంఠ రేపుతున్న రెండో వన్డే

నేడే ఇండియా-వెస్టిండీస్‌ల మధ్య పోరు

ఉత్కంఠ రేపుతున్న రెండో వన్డే
India , West indies 2nd oneday match

విశాఖపట్నంఫ భారత్‌- వెస్టీండీస్‌ టీంల మధ్య ఈనెల 18న జరగనున్న వైఎస్‌ఆర్‌-ఎసిఎ క్రికెట్‌స్టేడియంలో ఉత్కంఠ భరితంగా నేడు జరగనున్న వన్డేమ్యాచ్‌ ఈ ప్రాంత క్రికెట్‌ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్త క్రికెట్‌ అభిమానులకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆదివారం చెన్నైలో జరిగిన తొలి వండేలో వెస్ట్‌ఇండీస్‌ చేతిలో భారత్‌ ఓటమి చెందిన నేపధ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ మ్యాచ్‌ విశాఖ ప్రాంత క్రికెట్‌ ప్రియులకు ఆనందాన్ని పంచడంతో పాటు, కొందరికి గెలుపు మనదేనన్న ధీమాను కలిగిస్తుండగా, మరికొందరికి ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆందోళనను కలిగిస్తుంది. దీనికి ఇప్పటివరకు విశాఖలో జరిగిన అన్ని మ్యాచ్‌లలోను ఆస్ట్రేలియా విజయం సాధించడం ఒక కారణమైతే, 2001 ఏప్రెల్‌ నెలలో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలవడం మరొక కారణంగా భావిస్తున్నారు.

అప్పటికీ, ఇప్పటికీ ఇండియా చాలా బలోపేతమైందని, ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపైనే కట్టడిచేసి, పైచేయి సాధించిందని ధీమా వ్యక్తమవుతుంది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు విశాఖలో క్రెకెట్‌ ప్రస్తానం గురించి, ఈ గ్రౌండ్‌కు సంబంధించిన వివరాలను, నేటివరకు జరిగిన వివిధ పోటీల ఫలితాలను ప్రభాతవార్త ఒక్కసారి పాఠకుల ముందు ఉంచుతుంది.
గ్రౌండ్‌కు సంబంధించిన సమాచారం: ఈ గ్రౌండ్‌ను 2003లో ఏర్పాటు చేశారు. ఈ గ్రౌండ్‌లో 50వేల మంది వరకు ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్‌ను తిలకించడానికి అవకాశం ఉంది. దీనిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్మించింది. దీనిని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తుంది. దీనిలో ఇండియన్‌ క్రికెట్‌ టీం, ఆంధ్రా క్రికెట్‌టీం వారి మ్యాచ్‌లను ఏర్పాటు చేసు కునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈగ్రౌండ్‌లో ఒక వైపు ఎండ్‌ను విజ్జీ ఎండ్‌ అని, మరొకవైపు ఎండ్‌ను డి.వి.సుబ్బారావు ఎండ్‌ అని పిలుస్తుంటారు.

విశాఖలో జరిగిన మ్యాచ్‌ల వివరాలివే:

ఇప్పటివరకు విశాఖ నగరంలోని ఇందిరాగాంధి ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో ఐదు వండేమ్యాచ్‌లు జరగగా, వైఎస్‌ఆర్‌-ఎసిఎ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక టెస్టుమ్యాచ్‌, నిన్నటి మ్యాచ్‌తో కలిపి మూడు వన్డేమ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్‌ జరిగాయి. నగరంలో ఉన్న ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ క్రికెట్‌స్టేడియం దాదాపుగా 1988 నుంచి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలకు వేదికగా మారింది. తొలిసారిగా 1988లో డిసెంబర్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన వండేమ్యాచ్‌లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజి లాండ్‌పై విజయం సాధించింది.

న్యూజిలాండ్‌ చేసిన 196 పరుగులను భారత్‌ అవలీలగా పూర్తిచేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత 1994లో నవంబర్‌ నెలలో ఇండియా వెస్టండీస్‌ జట్ల మధ్య జరిగిన వండే మ్యాచ్‌లో కూడా ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది. వెస్టిండీస్‌ ఏడు వికెట్ల నష్టానికి చేసిన 256 పరుగులకు బదులుగా ఇండియా టీం కేవలం నాలుగు వికెట్లను కోల్పొయి 260 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 1996 ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియా-కెన్యా జట్ల మధ్య జరిగిన వండేమ్యాచ్‌లో ఆస్ట్రేలియా 97 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా 304 పరుగులు చేయగా, కెన్యా 207 పరు గులకే పరిమితమైంది.

ఆతర్వాత 1999 మార్చినెలలో శ్రీలంక-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన వండేమ్యాచ్‌లో శ్రీలంక 12 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 253 పరుగులు చేయగా, పాకిస్తాన్‌ జట్టు 241 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత 2001 ఏప్రెల్‌లో ఆస్ట్రే లియా-ఇండియాల మధ్య జరిగిన వండేమ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను 93 పరుగులతో ఓడించింది. విశాఖ గడ్డపై భారత్‌కు ఇదే తొలి అపజయం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేయగా, భారత్‌ 245 పరుగులకే అలౌట్‌ అయి మ్యాచ్‌ను సమర్పించుకొంది.

నగరం పెరగడం, ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతుండడంతో ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియం క్రికెట్‌ పోటీలకు దూరమయ్యింది. అప్పుడే పి.ఎం.పాలెం ప్రాం తంలో క్రికెట్‌ స్టేడియంను నిర్మిస్తే బాగుంటుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి నిర్మాణానికి పచ్చజెండా ఊపడం జరిగింది. ఆనాటి కలల స్వరూపమే ఈ వైఎస్‌ఆర్‌-ఎసిఎ క్రికెట్‌స్టేడియం. ఈ గ్రౌండ్‌లో తొలి వన్డేకు 2005లో అథిధ్యం ఇవ్వడం, అదీ మన దాయాది దేశం పాకిస్తాన్‌తో కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నెరవేర్చిన మహేంద్రసింగ్‌ధోనీ 148 పరుగుల అత్యధిక స్కోరు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి గుర్తింపును పొందాడనడంలో అతిశయోక్తిలేదు.

అదేవిధంగా 2016 ఫిబ్రవరిలో ఇండియా శ్రీలంకల మధ్య జరిగిన టి20లో కూడా ఇండియాదే అధిపత్యం కావడం, అందులో రవిచంద్ర అశ్విన్‌ నా లుగు ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం, శ్రీలంక 83 పరు గుల అతితక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడం ఈ గ్రౌండ్‌లో భారత్‌దే ఆధిపత్యం అని తేల్చింది.ఈ స్టేడియంకు టెస్ట్‌హోదాను 2016లో నవంబర్‌ 17నుంచి 21వరకు ఇండియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్టు తోనే ఇవ్వ డం, అమ్యాచ్‌లో ఇండియా ఇంగ్లాండ్‌ను 246 పరుగులతో చిత్తుచేయడం గుర్తుండే ఉంటుంది.

2016లో జరిగిన మూడు (ఒక టెస్టు,ఒక వన్డేమ్యాచ్‌, ఒక టి20) అంత ర్జాతీయ పోటీలలో భారత్‌ విజయాన్ని సాధించడం జరిగింది. వీటికి సం బంధించిన వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం. 2016లో మహారాష్ట్రలో నీటికొరత ఏర్పడడంతో మూడు ఐపిఎల్‌ మ్యాచ్‌లకు అవకాశం కల్పించడం జరిగింది.దీనితో ముంబాయి ఇండియన్స్‌, రైజింగ్‌ సూపర్‌జెయింట్స్‌ మూ డుమ్యాచ్‌లు ఇక్కడ అడడం జరిగింది. మే17న జరిగిన ఇంకొక మ్యాచ్‌లో రెయిజింగ్‌ పూనే తరుపున ఆడిన మహేంద్రసింగ్‌ధోనీ ఆఖరి ఓవర్‌లో 23 పరుగులును కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ తరపున అడిన ఆక్షర్‌పటేల్‌ నుంచి రాబట్టుగలిగాడు
వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో టెస్టులు, వన్డేలలో నమోదైన సెంచరీలు, వాటిలో ఆయా జట్ల ఫలితాలు: వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇప్పటివరకు రెండు టెస్టుమ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండిటిలో భారత్‌ విజయకేతనాన్ని ఎగర వేసింది. 2016నవంబరులో భారత్‌-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన టెప్టుమ్యాచ్‌ (ఈ గ్రౌండ్‌కు అమ్యాచ్‌తోనే టెస్టుమ్యాచ్‌ హోదా లభించింది)లో భారత్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టెస్టులో చటేశ్వర్‌ పూజారా 204 బంతులలో 119 పరుగులు చేశాడు.

ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ 267 బంతులలో 167 పరుగులుచేశాడు. 2019 అక్టోబరులో భారత్‌-సౌత్‌ ఆఫ్రికాల మధ్య మరోటెస్టు మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరుపున మయాంక్‌ అగర్వాల్‌ 371 బంతులలో 215 పరుగులుచేసి డబల్‌సెంచరీని నమోదుచేశాడు. రోహిత్‌శర్మ కూడా మొదటి ఇన్నింగ్‌లో 244 బంతులలో 176 పరుగులు, రెండో ఇన్నింగ్‌లో 149 బంతులలో 127 పరుగులు చేయడంతో భారత్‌ దక్షిణఆఫ్రికాను ఓటమిదిశగా అడుగులు వేయించింది. అయినా దక్షిణఆఫ్రికా తరపున డీన్‌ఎల్గర్‌ 287 బంతులలో 160 పరుగులు, క్వింటన్‌ డీకాక్‌ 111 బంతులలో 111 పరుగులు చేసినా వారి టీంను ఓటమి నుంచి కాపాడలేకపోయారు.

వన్డేలు ఇప్పటివరకు అరు జరుగగా వాటిలో మూడింటిలో భారత్‌ విజయం సాధించగా, రెండింటిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకదానిలో టైతో సరిపెట్టుకుంది. వాటి వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం. 2005 ఏప్రిల్‌లో ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన వన్డేలో ఎం.ఎస్‌.ధోనీ 123 బంతులలో 148 పరుగులతో చెలరేగడంతో పాకిస్థాన్‌ పరాజయంతో ఖంగుతింది. 2007 ఫిబ్రవరిలో శ్రీలంక-భారత్‌ల మధ్య జరిగిన వన్డేలో శ్రీలంకకు చెందిన చమరసింహ 107 బంతులలో 107 పరుగుల చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.

2010 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్‌క్లాక్‌ 139 బంతులలో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి వారి టీంను బలోపేతం చేయగా, భారత్‌కు చెందిన విరాట్‌కోహ్లీ 123 బంతులలో 118 పరుగులు చేసినా, భారత్‌ పరాజ§ ూన్ని మూటగట్టుకోకతప్పలేదు. 2011లో భారత్‌-వెస్ట్‌ఇండీస్‌ల మధ్య జరి గిన వండేలో విరాట్‌కోహ్లీ 123 బంతులలో 117 పరుగులు చేసి భారత్‌ను గెలిపించి, వెప్ట్‌ఇండీస్‌ను పరాజయానికి గురిచేశాడు.

2017 డిసెంబర్‌లో భారత్‌-శ్రీలంకల మధ్య జరిగిన వన్డేలో భారత్‌కు చెందిన µశిఖర్‌ధావన్‌ 85 బంతులలో 100 పరుగులుచేసి, నాటౌట్‌గా నిలిచి శ్రీలంకను ఓడించడానికి సహకరించాడు. 2018 అక్టోబరులో భారత్‌-వెస్ట్‌ఇండీస్‌ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన వన్డేలో భారత్‌ తరుపున విరాట్‌కోహ్లీ 129 బంతులలో 157 పరుగులు చేసి కదంతొక్కగా, వెస్ట్‌ఇండీస్‌ తరపున కూడా షా§్‌ుహోప్‌ 134 బంతులలో 123 పరుగులు చేసి భారత్‌కు తామేమీ తీసిపోమని సవాల్‌ విసరడమేగాక మ్యాచ్‌ను టైగా ముగించాడు.

ఈ నేపధ్యంలో బుధ వారం (డిసెంబర్‌ 18) జరగనున్న ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందోనని అం దరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఔట్‌ఫీల్డు పరిస్థితి: ఈ గ్రౌండ్‌లో ఔట్‌ఫీల్డు పూర్తిగా పచ్చదనాన్ని సం తరించుకొని అటు క్రీడాకారులను, ఇటు సందర్శకులను అలరిస్తుంది. ఈ ఔట్‌ఫీల్డు ఏర్పాటుకు ప్రత్యేకంగా కరేబియన్‌ దేశాలనుంచి లాన్‌గడ్డిని రప్పించడం జరిగింది. అంతేగాక పచ్చదనాన్ని సంరక్షించేందుకు, క్రీడాకారులకు, సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా మంచినీటి వసతిని పూర్తిగా అందుబాటులో ఉంచడం జరిగింది.
పిచ్‌ పరిస్థితి: ఈ గ్రౌండ్‌లో పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుంటుందని మ్యాచ్‌ను తిలకించినవారితో పాటు, ఫలితాలు చెబుతుంటాయి. బంతి బౌన్సుకాక పోవడంతో బ్యాట్‌వెన్స్‌ పరుగులు తీయడానికి సాహసం చేయాల్సి రావడంతో బౌలర్త పంటపండుతుందని క్రికెట్‌ పండితులు చెబుతుంటారు. సెకండ్‌ బ్యాటింగ్‌కు దిగిన టీం 80 పరుగులు కూడా చేయలేకపోవడం ఈ పిచ్‌ ఎంత ప్రమాదమైనదో నిరూపిస్తుంది. ఈ గ్రౌండ్‌ దక్కన్‌ చార్జర్స్‌(2012లో) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2015లో) రైజింగ్‌పూనే సూప ర్‌ జెయింట్స్‌, ముంబాయి ఇండియన్స్‌ టీంలకు 2016లో ఐపిఎల్‌ మ్యాచ్‌ లకు అథిధ్యం ఇచ్చింది. మరి బుధవారం జరగనున్న ఇండియా-వెస్ట్‌ ఇం డీస్‌ల మధ్య జరగనున్న రెండో వన్డేలో ఏజట్టు విజయం సాధిస్తుందో, రానున్న రోజులలో ఇంకా ఎన్నిమ్యాచ్‌లు జరుగుతాయో, అవి ఎలాంటి ఫలితాలని ఇస్తాయో వేచిచూడాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/