జయదేవ్‌ను హింసిచడం బాధాకరం

somireddy chandramohan reddy
somireddy chandramohan reddy

అమరావతి: టిడిపి ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్రంతో చర్చించి ఇండియా మ్యాప్‌లో అమరావతికి చోటు కల్పించిన నాయకుడు అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఎంపీ గల్లా జయదేవ్‌తో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని విమర్శించారు. ఈ రోజు రాజధాని అమరావతికి మద్దతుగా నిలిచిన జయదేవ్‌ను పోలీసులు దారుణంగా హింసించడం బాధాకరమన్నారు. కొట్టడమే కాక ఆయనపైనే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని సోమిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/