వైద్య సిబ్బంది పై దాడులను నిరోధించాలి

వైద్యుల రక్షణ బిల్లుపై కేంద్ర హోంశాఖ పునరాలోచన చేయాలి

Jayadev Galla
Jayadev Galla

న్యూఢిల్లీ: వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు నిరోధించేందుకు కేంద్రం ఆరోగ్య శాఖ రూపొందించిన బిల్లును హోం శాఖ వెనక్కిపంపడం సరికాదన్ని టిటిపి ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. ఈవిషయంపై పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ఆ భగవంతుడికి మనుషుల్ని సృష్టించే శక్తి ఉంటే.. వైద్యులకు ప్రాణాలు కాపాడే శక్తి ఉంది. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించే బిల్లును పక్కనపెట్టిన కేంద్రం హోం శాఖ తన వైఖరిని పున:పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై ఎలాంటి శారీరక, మానసిక వేధింపులు జరగకుండా రక్షించుకోవడం మన బాధ్యత. వారిపై ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలి’ అని జయదేవ్ వరుస ట్వీట్స్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/