రాజకీయ కక్షలతో ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదు
ఏపీలో రాజకీయ రాక్షస వ్యాపార క్రీడ నడుస్తోంది!

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షలతో ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల మధ్య గోడవలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విశాఖ ప్రశాంత నగరమని తెలిపారు. విశాఖలో కొట్టుకోవడం, చెప్పులతో, గుడ్లతో దాడులు చేసుకోవడం అనేది విశాఖ సంస్కృతి కాదన్నారు. తమిళనాడు తరహాలో ఏపీ వెళ్తుందా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజకీయ రాక్షస వ్యాపార క్రీడ నడుస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వానికి పోలీసులు మద్దతు పలికితే..ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుందని మాధవ్ పేర్కొన్నారు. ఆందోళనకారులు ఎయిర్‌పోర్టులోకి రాకుండా పోలీసులు నివారించలేకపోయారని విమర్శించారు. పోలీసులే దీనికి సమాధానం చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/