అయోధ్య వివాదాస్పద భూమిలో మసీదు నిర్మాణం అసంభవం: ముస్లిం మేధావులు

ayodya
ayodya

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా ఫొటో: జమీర్‌ ఉద్దీన్‌ షా కొనసాగుతున్న అయోధ్య వివాదాస్పద భూ వివాదం సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదని ముస్లిం మేధావులు అంటున్నారు. ఈ కేసులో ముస్లిం తరపున పిటిషన్‌ వేసినవారు గెలుపొందినప్పటికీ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడమే మంచిదని మేధావులు అభిప్రాయపడ్డారు. వీరు తమను తాము ‘శాంతి కోసం భారత ముస్లింలు అన్నారు. అయితే వీరిలో ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ జమీర్‌ ఉద్దీన్‌ షా కూడా ఉన్నారు. ఆయన ఆర్మీ డిప్యూట్‌ చీఫ్‌గా పనిచేశారు. జమీర్‌ ఉద్దీన్‌ షా మాట్లాడుతూ వాస్తవాన్ని అర్ధం చేసుకోవాలని, ముస్లింలకు అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువరించినా మసీదు నిర్మించగలమా? అది అసంభవం. దేశంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మసీదు నిర్మించడం ఎప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది. ముస్లింలకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆ భూమిని మెజారిటీ ప్రజలకు బహుమానంగా ఇవ్వడమే మంచిదని జమీర్‌ ఉద్దీన్‌ షా పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/