మళ్లీ పెళ్లి చేసుకోవటమే మేలు

‘వ్యధ’- వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

Personal Problems-
Personal Problems-

కొంత మంది మగవారు లేదా అబ్బాయిలకి ఒంటరి ఆడవారు కనపడగానే ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అక్కున చేర్చుకుని ఆదరించేందుకు సిద్ధమవుతారు.

ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మే కష్టమొచ్చినా మేమున్నామంటుముం దుకు వస్తారు. కలసి తిరుగువారు, మొసలి కన్నీరు కారుస్తారు. పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయారు.

ఇలాంటి అవకాశవాదులు, మేకవన్నె పులులకు కొందరు మహిళలు బలౌతున్నారు. సర్వంపోగొట్టుకుని విగతజీవులవు తున్నారు.

ఇలాంటి పలు ఉదంతాలు చూసిన నాకు మగవారంటేనే భయమేస్తోంది. అయితే ఎంత జాగ్రత్తగా వున్నా ఎవరి బుట్టలో నన్నా పడతా నేమో అన్న అనుమానం వెంటాడుతోంది.

అలా అని ఒంటరిగా ఉండిపోతే జీవితం నిస్సారంగా ముగిసిపోతుందనిపిస్తోంది. అలాగే ఒంటరి జీవితం వృద్ధాప్యంలో శాపంగా పరిణిమిస్తుందన్న భావన మనసులో అలజడి సృష్టిస్తోంది.

ఏమి చేయాలో తెలియని సంఘర్షణతో సతమతమవుతున్నాడు.

నా వయస్సు 30 ఏళ్లు. బిటెక్‌ చదవి ఒక బహుళ జాతీయ కంపెనీలో పనిచేస్తున్నాను. ఐదేళ్ల క్రితం ఒకతనితో పెళ్లయింది. అతను ఎంటెక్‌ చదివాడు. నాకంటే రెండేళ్లు పెద్దవారు, రెండు రాళ్లు ఎక్కువ సంపా దనపరుడు.

అబ్బాయి వివరాలు అన్ని పరిశీలంచి మంచి సంబంధం అనిభావించి అమ్మ, నాన్నలు నన్ను అతనికి కట్టబెట్టారు. తొలి రోజే అతని అసమర్థత విషస్వభావం బయటపడింది. అతనిలో లోపం వుందని తెలిసినా తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి నన్ను పెళ్లాడినట్టు చెప్పాడు. ఇద్దరి జీతాలు కలిపి గొప్పగా బతకవచ్చని వివరించాడు.

డబ్బు, సంపద, పేరు, ప్రతిష్ట ఉంటేచాలని నన్ను నొప్పించే ప్రయత్నం చేశారు. ఒకవేళ నేను తప్పు చేసినా పట్టించుకోనని హామీ ఇచ్చాడు.

ఇలాంటి అసమర్థ, అనైతిక వ్యక్తితో కాపురం చేయడం ఇష్టంలేక మరుసటి రోజే అమ్మా, నాన్నలతో మరుసటి రోజే అమ్మా, నాన్నలతో వెళ్లిపోయాను.

చాలా చర్చలు, రాజీలు జరిగిన తరవాత ఏడాది అనంతరం కోర్టులో కలసి విడాకులకు దరఖాస్తు చేసుకున్నాము. మరి కొన్నాళ్లకు చట్ట బద్దంగా విడాకులు పొంది ఉద్యోగం చేసుకుంటున్నాను.

అమ్మా, నాన్నల వద్దే వున్నాను. మా తమ్మునికి అత్తవారు, భార్య ఇతర బంధువులు నన్ను ఆదరంగానే చూస్తున్నారు. నా దురదృష్టం పట్లకొంత సానుభూతి కనపరుస్తున్నారు.

అయితే కొందరు అబ్బాయిలు నన్ను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానంగా మెసేజ్‌లు పెట్టడం ఎదురుపడితే మాట్లాడటం చేస్తున్నారు. అయితే వారందరిది కపట ప్రేమ అభిమానం అన్నది అర్థమవుతున్నది. అయితే వారిని పూర్తిగా తిరస్కరించలేకపోతున్నాను.

ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి, నా గతం తెలిసితుర్రుమన్నాడు. ఈ నేపథ్యంలో పదో ఒక బలహీన క్షణంలో ఎవరికైనా లొంగిపోతానేమో అనిపిస్తోంది. అయితే నన్ను నేను నియంత్రించుకుంటానన్న విశ్వాసము ఉంది. కాగా ఒంటరి జీవితం మంచిది కాదని మళ్లీ పెళ్లి చేసుకోమని స్నేహితురాళ్లు. తల్లిదండ్రులు హితవు చెపుతున్నారు.

అయితే నాగతం తెలిసి నన్ను ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరుకుతాడా అన్నదే అనుమానంగా ఉంది. ఒక వేళ పెళ్లయిన తరువాత వేధిస్తే చేయగలిగేది ఏమీ ఉండదు. కదా అని భయమేస్తోంది.

ఈ దశలో మళ్లీ పెళ్లి చేసుకోవడం మంచిదేనా? మంచి వ్యక్తిని అంచనా వేయాలంటే ఏమి చేయాలో తెలపండి. – సునీత, చెన్నై

అమ్మా, మీరు గత అనుభవం వల్ల భయపడుతున్నారు. అలాగే సమాజంలో జరగే కొన్ని సంగటనల మిమ్మల్ని భయపెడుతున్నాయి.

మన సమాజంలో అన్ని రకాల మనుషులు, మనస్తత్వాలు ఉన్నాయి. ప్రేమ మూసుగులో మోసం చేసేవారు. కొందరు ఉన్న మాట వాస్తవమే. అయితే అందరూ అలా ఉండరు.

మానవత్వం, ప్రేమ తత్వం ఉన్న వారే సమాజంలో ఎక్కువగా ఉంటారు. అయితే ఆచారాలు, పద్ధతులు, సెంటిమెంట్లు కొందరిని ముందడుగు వేయనీ యవు. కాబట్టి వారిని తప్పుగా అర్థం చేసుకోవలసిన పనిలేదు.

ఎవరి భావాలు వారివన్న విషయం గ్రహించి సహించడం నేర్చుకోవాలి. అలాగే ఒక వ్యక్తి నిజాయితీని ఎలా అంచనా వేయాలి? జీవితాంతం అతను అలాగే వుంటారా? ఉన్నది అంత సులభమైన విషయంకాదు. వ్యక్తి ప్రవర్తన, వ్యవహారశైలి. వ్యక్తీకరించే దృక్పథం లాంటి అంశాలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.

అయితే కొందరు లోపల ఒక విధంగా, బయటికి ఒక విధంగా కనిపిస్తుంటారు. పైకి చాలా ఉన్నతులుగా అభినయిస్తూ, సమయం వచ్చినపుడు వికృతరూపం బయటపెడుతుంటారు.

అలాగే పరిస్థితులు, పరిణామాలు, హార్మోను, సన్నిహి తులు, సహచరులు, ప్రకృతిలాంటి అనేక అంశాలు మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ప్రతివారు సర్వకాల, సర్వావస్థలయందు ఒకేలాగ ఉంటారని చెప్పలేము.

మన ప్రవర్తన, వ్యవహారశైలి తీరు తెన్నులను బట్టికూడ ఎదుటి వారు మనతో ప్రవర్తించే తీరు ఆధారపడి ఉం టుంది. అయితే మన సమాజంలోమంచి వారే ఎక్కువగా ఉంటారన్న నమ్మకాన్ని పెంచుకోండి.

మోసగాళ్లు, దోపిడిదారులు ఐదు శాతం వరకు ఉండవచ్చని నా అంచనా! కాబట్టి మీ పట్ల అభిమానం చూపే వారందరి పట్ల అనుమానం పెంచుకోకండి. అలా అని ప్రతివారిని నమ్మకండి.

అతిగా ఎవరితోను ప్రవర్తించకుందా, మీ పరిధిలో మీరు ఉంటు మానవ సంబంధాల నిర్వహించండి.

మీ ప్రవర్తన, దృక్పథం, విలువలు పాటించడంలో ఖచ్చితంగా కనిపించండి. అనగాహన, సమయస్ఫూర్తి కలిగి వ్యవహారాలు నడపండి.

కాగా మీరు ఒంటరిగా ఉండటంకంటే మళ్లీ పెళ్లి చేసుకోవడమే మేలు. కేవలం కెరీర్‌ డబ్బు సంపాదనకే పరిమితమైతే చాలా జీవిత మాధుర్యాలనుకోల్పోవలసి వస్తుంది.

మీ గతాన్ని చెప్పి, ఆదరించే వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోండి. తప్పు మీదికాదు కాబట్టి గతాన్ని దాచవలసిన
అవపరం లేదు. ఒకవేళ మీలాగే విడిపోయిన వారైనా పరవాలేదన్నవిషయం దృషిలో పెట్టుకోండి.

అలాగే అతనితో సర్దుకుని జీవనం సాగించడానికి సిద్ధపడండి. అలాగే ప్రతికూల భావాలు తగ్గించి సానుకూలంగా కెరీర్‌ పట్ల శ్రద్ద చూపండి.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/specials/career/