బురఖాలు వేసుకున్నమహిళలను సభలోకి రానివ్వరా?: చంద్రబాబు

ఇది పోలీసు భద్రత కాదు.. జగన్ అభద్రత అని వ్యాఖ్య

it-is-atrocious-to-remove-women-chunnis-in-jagan-sabha-says-chandrababu

అమరావతిః నరసాపురంలో నిన్న సిఎం జగన్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. సీఎం సభ వద్ద మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై టిడిపి అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

ఇప్పటికే పరదాలు, బ్యారికేడ్ల మధ్య పర్యటనలకు వెళ్తున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలను కూడా తీసివేయించడం దారుణమని అన్నారు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? అని ఆయన ప్రశ్నించారు. గొడుగులు చూసి కూడా ఎందుకు భయమని అడిగారు. ఇదంతా పోలీసు భద్రత కాదని… జగన్ రెడ్డి అభద్రత అని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/