బెంచ్‌ టైమ్‌ను తగ్గించిన ఐటీ దిగ్గజం

Cognizant IT Company
Cognizant IT Company

ఢిల్లీ: అమెరికా ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగులకు గరిష్ఠ బెంచ్ టైమ్‌ను తగ్గించింది. వచ్చే నెలల్లో అధిక సంఖ్యలో తొలగింపు ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది వరకు వేరే యూనిట్ లేదా వేరే ఊరికి బదిలీ చేస్తే వెళ్లనివాళ్లు, ఇతర బాధ్యతలు వద్దనుకునేవాళ్లను గతంలో కంపెనీ నుంచి తొలగించింది. ఏ ఉద్యోగులకైతే బిల్లింగ్ ప్రాజెక్టులు లేవో, వారి బెంచ్ టైమ్‌ను 60 రోజుల నుంచి 35 రోజులకు సంస్థ కుదించింది. 35 రోజుల తర్వాత ఈ ఉద్యోగులకు ఎలాంటి ప్రాజెక్టు లేకపోతే కంపెనీ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. తొలగింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు బెంచ్ టైమ్ తర్వాత 60 నుంచి 90 రోజులు ఉండనుంది. గతంలో ఇలాంటి ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులకు కొంత అదనపు కాలం ఉండేది, అయితే కంపెనీ తాజా నిర్ణయంతో పలువురు ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంపై కాగ్నిజెంట్‌ అధికారిక ప్రకటన వెలువరించలేదు. కాగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఆర్ధిక ఫలితాలను కాగ్నిజెంట్ వెల్లడిస్తూ దాదాపు 13వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/