దాదాని పోగడ్తలతో ముంచెత్తిన కోహ్లీ

sourav ganguly & virat kohli
sourav ganguly & virat kohli

కోల్‌కతా: భారత క్రికెట్‌ జట్టు వరుస విజయాలతో దుమ్మురేపుతూ ఉండటంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జోష్‌లో ఉన్నాడు. కోల్‌కతాలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం కెప్టెన్‌ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ..టెస్టు క్రికెట్‌లో ఆలోచనా శక్తితో విజయాలు సాధించడం ఎలాగో గంగూలీనే చేసిచూపించాడని, ఇప్పుడు తాము ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నామని తెలిపాడు. టెస్టు క్రికెట్‌ మనసిక యుద్ధం అయితే, ఆ పోరాటాన్ని ఎలా గెలవాలో నేర్పించిన ఆద్యుడు సౌరవ్‌ గంగూలీనే అని కోహ్లీ కొనియాడాడు. దాదా నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసంతో కఠినంగా పరిశ్రమించి, ఆ పరంపరను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించాడు. కాగా బంగ్లాదేశ్‌తో చారిత్రక పింక్‌ టెస్టులో విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను 2-0 తేడాతో భారత్‌ సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో కోహ్లీసేన టెస్టుల్లో 12వ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు, వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/