చంద్రయాన్‌-2 ప్రయోగానికి తేదీ ఖరారు

Chandrayaan 2
Chandrayaan 2

అమరావతి: భారత్‌ ఇస్రో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ ‘చంద్రయాన్2 ఈ నెల 15న ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే నెల 22, సోమవారం నాడు నిర్వహించనున్నట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. జూలై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్2 రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపింది. కాగా, రాకెట్ లో కనుగొన్న సాంకేతిక లోపాలను ఇప్పటికే సవరించామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా రాకెట్ ప్రయోగం జరగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/