ఇస్రో జీశాట్‌-1 మరో ప్రయోగం

ISRO
ISRO

నెల్లూరు: ఇస్రో మరో ప్రయోగం చేపట్టనుంది. జీశాట్‌-1 ను ఇస్రో రేపు సాయంత్రం 5.43 గంటలకు ప్రయోగించనుంది. జియోస్టేషనరీ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను భారత్‌ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్‌ టైమ్‌ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్‌ చేస్తుంది. జీశాట్‌1 బరువు 2268 కిలోలు. శ్రీహరికోటలోని రెండవ లాంచ్‌ ప్యాడ్‌ను నుంచి జీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్‌1 ఉపగ్రహం… జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్‌ భూమికి సుమారు 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్‌1 ఉపగ్రహం ఏడేళ్ల పాటు పనిచేయనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/