ఇస్రో ఎల్‌వీఎం 3 ప్రయోగం సక్సెస్ ..

Isro launches 36 OneWeb satellites precisely

ISRO మరో రికార్డు సాధించింది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 (GSLV MARK-3) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎల్‌వీఎం3-ఎం2/వన్‌వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతంమైందని, 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది.

ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ అయిన వన్‌‌వె‌బ్‌కి చెందిన 36 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా నిగిలోకి పంపించారు. యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్‌ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయోగం విజయంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు.