విక్రమ్‌ ల్యాండర్‌ జాడను గుర్తించింది నాసా కాదు మేమే

మా సొంత ఆర్బిటర్ ల్యాండర్‌ను గుర్తించింది

Shivan
Shivan

చెన్నై: విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ మాట్లాడుతూ..చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ధ్వంసమైన ఉపగ్రహ వాహక నౌకజాడను మూడు రోజుల తర్వాత తామే గుర్తిం చామని ఇస్రో చైర్మన్ కైలాసవడివూ శివన్ ప్రకటించారు. కావాలంటే ఈ విషయాన్ని ఇస్రో వెబ్ సైట్లో చూడొచ్చని తెలిపారు. చం ద్రుడి భూ ఉపరితలం పై ఉన్న ఖనిజాలు, నీటి జాడలు కనుక్కునేందుకు ఇస్రో చంద్రయాన్2 ప్రాజెక్టులో భాగంగా రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్‌ను ఈ ఏడాది జూలై 22న పంపిన విషయం తెలిసింది. ప్రయోగం అంతా సాఫీగా జరిగి 48 రోజులపాటు కక్ష్యలో పరిభ్రమించిన ఆర్బిటర్ ల్యాండర్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆర్బిటర్ మెల్లగా దూరాన్ని తగ్గించుకుంటూ చంద్రుని ఉపరితలం వద్దకు వెళ్లింది. దీంతో సెప్టెంబరు 7న ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలం పై దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. సాఫ్ట్ ల్యాండింగ్ దశలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్ ఫోర్స్ లాండింగ్ జరిగి ధ్వంసమైన విషయం తెలిసిందే.

నిర్దేశిత ప్రాంతానికి 750 మీటర్ల దూరంలో ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని అతివేగంగా ఢీ కొట్టి ధ్వంసమ మయ్యిందని తాజాగా నాసా నిన్న ప్రకటించింది. షణ్ముగ సుబ్రమణియన్ అనే భారతీయ ఔత్సాహిక శాస్త్రవేత్త సహకారంతో ఈ విషయాన్ని తాము గుర్తించగలిగామని నాసా పేర్కొంది. అయితే నాసా ప్రకటనను శివన్ ఖండించారు. వివరాలను ఇస్రో వెబ్ సైట్లో చూడాలని కోరారు. నాసా ఉంచిన చిత్రాల్లో ముక్కలైన ల్యాం డర్ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఇస్రో చిత్రాల్లో అటువంటి దేమీ లేదు. ల్యాండర్ ఢీకొట్టిన ప్రాంతాన్ని చిన్న చుక్కగా మాత్రమే చూపించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/