శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

ISRO Chairman Sivan
ISRO Chairman Sivan

తిరుమల: ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 ప్రయోగం సందర్భంగా ఆయన, పలువురు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శంచుకున్నారు. చంద్రయాన్‌2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శివన్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/