శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్‌

ISRO Chairman Sivan
ISRO Chairman Sivan

తిరుమల: ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం తోమాల సేవలో పాల్గొని పిఎస్ఎల్వి సి46 నమూనాను స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కే శివన్ కు వేదపండితులు వేదాశిర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రేపు ఉదయం 5.30 గంటలకు పీఎస్.ఎల్.వి సి46 శాటిలైట్ ను కక్ష్యలోకి పంపనున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. తదుపరి ప్రాజెక్ట్ గా జులై 9,16 తేదీల్లోపు చంద్రాయాన్ 2 మిషన్ ను కూడా ప్రయోగించనునట్లు…. చంద్రునిపైకి సెప్టెంబర్ 6వ తేదీ చంద్రయాన్ 2 ల్యాండ్ అవుతుందని పేర్కొన్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/