అమెరికా నుండి ఇజ్రాయిల్ క్షిపణి ప్రయోగం

జెరూసలేం : తాము అమెరికాలోని అలాస్కా ప్రయోగ కేంద్రం నుండి నిర్వహించిన క్షిపణి ప్రయో గాలు విజయవంతమయ్యాయని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ట్వీట్లో వెల్లడించారు. ‘మూడు బాలిస్టిక్ క్షిపణులను అనూహ్యమైన వేగంతో సంధించిన శాస్త్రవేత్తలకు అభినందనల’ని ఆయన పేర్కొ న్నారు. అలాస్కా రాష్ట్రంలోని యుఎస్ స్పెసిఫిక్ స్పేస్‌పోర్ట్ కాంప్లెక్స్నుండి తాము ప్రయోగించిన క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని ఆయన వివరించారు. ప్రత్యర్థి దేశాలు ప్రయోగించే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణు లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తాము దేశీయ పరిజ్ఞానంతో ఈ క్షిపణులను రూపొం దించామని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ తన ఆయుధ శ్రేణిని దేశం వెలుపల ప్రయోగించి పరీక్షించటం ఇదే తొలిసారి. ఈ ప్రయోగపరీక్షలకు సహకరించిన అమెరికాకు నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షిపణి ప్రయోగాలు విజయవంతం కావటంపై అమెరి కన్ ప్రభుత్వ నేతలు కూడా ఇజ్రాయిల్‌కు అభి నందనలు తెలియచేశారు.
తాజా యాత్ర వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/tours/