తొలి మాస్క్ ర‌హిత దేశం ఏదో తెలుసా?

జెరుసలేం : ఇజ్రాయెల్ దేశ‌వాసులు క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ష్టి విజ‌యం సాధించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 20 న ప్రారంభించిన టీకా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసి ఈ నెల 15 నుంచి మాస్క్‌ల‌ను ధ‌రించే నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేయ‌నున్నారు. దాంతో తొలి మాస్క్ ర‌హిత దేశంగా ఇజ్రాయెల్ నిలువ‌నున్న‌ది.ఈ విష‌యాన్ని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి యులి ఎడెల్స్‌టెయిన్ ప్రకటించారు. ఈ నెల ఒక‌టే తేదీ నుంచే గుంపులుగా ఉండ‌టం, ప‌రస్ప‌ర దూరం పాటించాల‌నే నిబంధ‌న‌ల‌ను ఎత్తివేశారు.

అయితే, పొరుగు దేశాల్లో క‌రోనా వ్యాక్సిన్ కార్య‌క్ర‌మాలు ఇంకా కొన‌సాగుతుండ‌టంతో విదేశీ ప్రయాణంపై ఆంక్షలు ఇంకా ఎత్తివేయలేదు. తొమ్మిది దేశాలకు ప్రయాణించడంపై ఇప్పటికీ నిషేధం కొన‌సాగుతున్న‌ది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు నిర్బంధ నియమం అమ‌లులో ఉన్న‌ది. వారికి కరోనా పరీక్షలు కూడా నిర్వ‌హించ‌నున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/