అక్టోబరులో ఇజ్రాయెల్‌లో వ్యాక్సిన్‌‌ క్లినికల్‌ ట్రయల్స్‌!

Israel to begin COVID-19 vaccine trials in October

టెల్‌ అవీవ్‌: కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఇజ్రాయెల్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. మొదట వంద మంది వలంటీర్లపై ట్రయల్స్‌ నిర్వహిస్తామని ఆ దేశం వెల్లడించినట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌ షెబా హాస్పిటల్, జెరూసలెంలోని హడస్సా మెడికల్ సెంటర్లో ప్రారంభం కానున్నాయి.

ఇజ్రాయెల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్న టీకాను ఆ దేశ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్‌) అభివృద్ధి చేసింది. దీనిని మానవులకు హాని కలిగించని మరొక వైరస్ ఆధారంగా రూపొందించడం విశేషం. దీనిని జూన్‌లో చిట్టెలుకలపై పరీక్షించారు. సానుకూల ఫలితాలు వచ్చాయి. అందులో వైరస్‌ అవశేషాలు కనిపించలేదు. అలాగే ,కరోనా వైరస్‌పై పోరాడే యాంటీబాడీలు తయారయ్యాయి. దీంతో హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టీకాను నిబంధనల ప్రకారం.. సమర్థవంతమైన, అదనపు నష్టాలు లేకుండా పరిపూర్ణమైన రీతిలో పరీక్షించాల్సి ఉందని హడస్సా డైరెక్టర్ జనరల్ జీవ్ రోట్‌స్టెయిన్ హీబ్రూ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/