తాము వ్యాక్సిన్‌ను తయారు చేశామన ఇజ్రాయె

మానవ ప్రయోగాలు ప్రారంభిస్తామన్న రక్షణ మంత్రి

తాము వ్యాక్సిన్‌ను తయారు చేశామన ఇజ్రాయె
Coronavirus vaccine- Israel

ఇజ్రాయిల్‌: కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలు తలమునకలై ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్ సిద్ధంగా ఉందంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. ఇక దీన్ని మానవులపై ప్రయోగించాల్సి వుందని, త్వరలోనే ఆ ప్రక్రియను ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి జెన్నీ గాండ్జ్ వెల్లడించారు. వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్)ని సందర్శించిన ఆయన, అక్కడ జరుగుతున్న పనులను ప్రారంభించారు. వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఈ వ్యాక్సిన్ తో శరీరంలో పెరుగుతాయని ఐఐబీఆర్ డైరెక్టర్ షహీరా వెల్లడించారు. కాగా, ఈ వ్యాక్సిన్ ఎప్పటికి సిద్ధమవుతుందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే, భారీ ఎత్తున ఈ వ్యాక్సిన్ ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైందని, ప్రధాని కార్యాలయం స్వయంగా వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తోందని సమాచారం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/