‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ప్రమోషన్స్‌

RAM pothineni
RAM pothineni

పూరి జగన్నాధ్‌ , ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌.. ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ విజయవాడలో సందడి చేసింది.. బందరురోడ్‌లోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హీరో రామ్‌తోపాటు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ , నభానటేష్‌లు పాల్గొన్నారు. రామ్‌ మాట్లాడుతూ, విజయవాడ రావటం సంతోషంగా ఉందన్నారు. పూరిజగన్నాధ్‌పై ఉన్న నమ్మకంతోనే ఈచిత్రంలో నటించినట్టు తెలిపారు. ఇద్దరు హీరోయిన్లు పోటాపోటీగా నటించారన్నారు. జగడం తర్వాత పూర్తిస్థాయి మాస్‌ చిత్రం చేయటం ఇదే నని అన్నారు. హీరోయిన్లు మాట్లాడుతూ పూరిజగన్నాధ్‌ దర్శకత్వంలో నటించటం వల్ల తమ కెరీర్‌కు ఎంతగానో దోహదపడుతుందన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించామని తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/